Shopping Cart 0 items - $0.00 0

మరీ ఇంత..కో ఇన్సిడెన్సా?

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు 24 అనే నెంబ‌ర్ బాగా క‌లిసొచ్చింది. ఇదేదో జాత‌కాల‌కు సంబంధించింద‌నుకుంటే పొర‌బాటే. ఈ విష‌యాన్ని కోఇన్సిడెంట్ అనొచ్చు. 1974లో తాత‌మ్మ క‌ల మూవీతో ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య‌కు స్టార్టింగ్‌లో ఆశించినంత విజయాలు రాలేదు. అయితే 1984లో వ‌చ్చిన మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు మూవీతో మాత్రం అదిరిపోయే మాస్ ఇమేజ్ వ‌చ్చింది. అంతే కాదు బాల‌య్య‌కు ఇదే ఫ‌స్ట్ హండ్రెడ్ డేస్ మూవీ. క‌లెక్ష‌న్ల వ‌ర్ష‌మే కాదు కొన్ని సెంట‌ర్స్‌లో 175 డేస్, 365 డేస్ కూడా ఆడింది. ఈ విధంగా మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు సినిమా బాల‌య్య కెరియ‌ర్‌లో ఓ మైల్ స్టోన్‌లా నిలిచింది. ఇక చిరుత‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్ కు త‌ను చేసిన సెకండ్ మూవీ మ‌గ‌ధీర ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. చిరుత యావ‌రేజ్‌గా నిలిచిందే త‌ప్ప ఇండ‌స్ట్రీ రికార్డ్స్ ని తిర‌గ‌రాయ‌లేక‌పోయింది. కానీ మ‌గ‌ధీర మాత్రం అప్ప‌టిదాకా వున్న రికార్డ్‌ల‌ను తుడిపేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. చ‌ర‌ణ్ కు నేమ్‌, ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇది చ‌ర‌ణ్ కెరియ‌ర్‌లో ఓ మైల్ స్టోన్‌లా నిలిచింది. అయితే ఈ రెండు సినిమాల‌కు ఓ చిన్న సంబంధం వుంది. అది కూడా 24లో ముడి ప‌డి వుంది. మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు చిత్రం టైమ్‌కు బాల‌య్య ఏజ్ 24 ఇయ‌ర్స్. మ‌గ‌ధీర రిలీజ్ అయ్యే టైమ్‌కు చ‌ర‌ణ్ ఏజ్ కూడా 24. సో ఆ విధంగా ఒకే ఏజ్‌లో కెరీర్‌ను ట‌ర్న్ చేసే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ను అందుకున్నారు. ఏది ఏమైనా కొన్ని కో ఇన్సిడెన్స్‌లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా ఇంట్ర‌స్టింగ్‌గా వుంటాయి. అంతే కాదు ఈ రెండు చిత్రాలు మ అనే అక్ష‌రంతో మొద‌ల‌వుతాయి.

Leave a comment

error: Content is protected !!