Shopping Cart 0 items - $0.00 0

పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడా?

 

తక్కువ చిత్రాల‌తో ఎక్కువ స్టార్‌డ‌మ్ తెచ్చుకుని క్రేజ్ అన్న ప‌దానికి ప‌ర్యాయ‌ప‌దంగా మారిన టాలీవుడ్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. హిట్స్ అండ్ ఫ్లాప్స్ కి ఏమాత్రం సంబంధం లేకుండా ఆల్వేస్ త‌న క్రేజ్‌తో బాక్సాఫీస్‌ని సైలెంట్‌గా బ‌ద్ద‌లు కొట్టే ప‌వ‌ర్‌స్టార్ రీల్ లోనే కాదు రియ‌ల్ గా కూడా హీరోనే అన్న విష‌యం కొన్ని ఇన్సిడెంట్స్ వింటే ఎవ‌రైనా ఒప్పుకోక మాన‌రు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి యూత్‌లో విప‌రీత‌మైన పేరు, క్రేజ్ ను తెచ్చిపెట్టిన చిత్రం తొలిప్రేమ‌. ఈ చిత్రంతోనే క‌రుణాక‌ర‌న్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ మూవీ షూట్ టైమ్ లో జ‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వింటే ప‌వ‌ర్ స్టార్ మీద ఎవ‌రికైనా అభిమానం క‌ల‌గాల్సిందే.
తొలిప్రేమ‌కు సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ ని కొడైకెనాల్ లో షూట్ చేసారు. ఇందులో హీరో హీరోయిన్స్‌కి సంబంధించిన కార్ యాక్సిడెంట్ సీన్ ఒక‌టుంటుంది. ఈ సీన్ తీసేట‌పుడు రోప్ తెగిపోయి హీరో హీరోయిన్స్ డూప్‌లు లోయ‌లో ప‌డిపోయారు. ఈ ఇన్సిడెంట్‌తో షాక్ అయిన క‌రుణాక‌ర‌న్ ఏం చేయాలో తెలియ‌క ఆలోచిస్తుంటే.. అక్క‌డే వున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ లోయ‌లోకి దిగి ఆ ఇద్ద‌రినీ ర‌క్షించాడు. సినిమాల్లోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లోనూ ఇలాంటి స‌హాయాలు, సాహ‌సాలు చేస్తూ రియ‌ల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నాడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Leave a comment

error: Content is protected !!