Shopping Cart 0 items - $0.00 0

కన్నీళ్ళు పెట్టుకున్న శ్రీకాంత్

హీరో శ్రీ‌కాంత్.. తాజ్ మ‌హాల్‌, పెళ్లి సంద‌డి, ఖ‌డ్గం, మ‌హాత్మ లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా హీరో అయిన శ్రీ‌కాంత్ కెరీర్‌లో క‌న్నీళ్లు తెప్పించేంత‌టి బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు కూడా వున్నాయి. ఆ సంఘ‌ట‌న‌లు వింటే ఎవ‌రైనా బాధ ప‌డాల్సిందే. శ్రీ‌కాంత్ అంత‌లా ఏడ‌వ‌డానికి కార‌ణ‌మైన చిత్రం షారుక్ ఖాన్ బాజీగ‌ర్. బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో త‌మ్మారెడ్డి భ‌ర‌ధ్వాజా వేట‌గాడు పేరుతో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేసాడు. శ్రీ‌కాంత్ కు వేట‌గాడులో హీరో ఆఫ‌ర్ ఇచ్చాడు త‌మ్మారెడ్డి. ఈ వేట‌గాడు ఆఫ‌ర్‌తో శ్రీ‌కాంత్ ఆనందానికి అంతులేకుండాపోయింది. ఎందుకంటే అప్పుడ‌ప్పుడే హీరోగా ఎదుగుతున్న శ్రీ‌కాంత్ బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అయిన బాజీగ‌ర్ రీమేక్ లో హీరోగా ఛాన్స్ రావ‌డం చాలా అదృష్టంగా ఫీల‌య్యాడు. అయితే ఇక్క‌డే క‌థ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. ఈ చిత్రాన్ని రాజ‌శేఖ‌ర్ చేస్తాన‌ని భ‌ర‌ధ్వాజ‌తో అన్నాడ‌ట‌. ఇక అంత పెద్ద హీరో అడ‌గ‌డంతో త‌మ్మారెడ్డి నో అన‌లేక‌పోయాడ‌ట‌. సో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న శ్రీ‌కాంత్ వేట‌గాడు అవ‌కాశం మిస్స‌వ‌డం త‌ట్టుకోలేక క‌న్నీరు పెట్టుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని త‌న లైఫ్ అత్యంత బాధాక‌ర‌మైన సంఘ‌ట‌నగా చెప్పుకుంటాడు శ్రీ‌కాంత్. కొస‌మెరుపేంటంటే.. ఇదే సినిమాలో శ్రీ‌కాంత్ ఇన్‌స్పెక్ట‌ర్ క్యారెక్ట‌ర్ ప్లే చేసాడు. హీరోగా మిస్స‌యి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించిన శ్రీ‌కాంత్‌కి ఇది ఓ మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న‌.

Leave a comment

error: Content is protected !!