Kajal Agarwal : సత్య భామ పాత్రలో కాజల్ డిఫరెంట్ గా నటించిందని టీజర్ లోనే తేలిపోయింది. ఏసీపీ సత్యభామ పాత్రలో కనిపించనుంది. తన కళ్లముందే హత్యకు గురైన ఒక అమ్మాయి కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ కేసు నుంచి అధికారులు సత్య భామను తప్పించినా ఈ హత్యను ఛేదించడానికి ఆమె తన వేటను ఎలా ప్రారంభించింది అనే విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి.

మే నెలాఖరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల తేదీని మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు జూన్ 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు క్రియేటర్స్. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఏసీపీ సత్యభామగా కనిపించింది. ఆమె యాక్షన్ మోడ్‌లో ఉంది, పోలీసు యూనిఫాంలో సీరియస్‌గా మరియు తుపాకీ పట్టుకుంది.

కాజల్ బాడీ లాంగ్వేజ్, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు పాత్రకు బలం చేకూరుస్తాయి. ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క సమర్పణలో శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ తన కెరీర్ లోనే సరికొత్త రికార్డులు నెలకొల్పాలని భావిస్తోంది.

Leave a comment

error: Content is protected !!