Shopping Cart 0 items - $0.00 0

‘టాక్సీవాలా’ దర్శకుడితో నాని

నేచురల్ స్టార్ నానీ లాస్టియర్ ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అందుకే ఈ ఏడాది తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘వి’ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తోన్న అతడు.. మరో వైపు శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘టక్ జగధీష్’ అనే కామెడీ ఎంటర్ టైనర్ కూ రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే.. నానీ మరో చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ రిపోర్ట్.

విజయ దేవరకొండ తో ‘టాక్సీవాలా’ అనే సూపర్ హిట్ మూవీ తీసిన  రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నానీ ఒక సినిమాకి కమిట్ అయ్యడని సమాచారం. ఆసక్తికరమైన స్టోరీలైన్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం స్ర్కిప్ట్ దశలో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు వెళ్ళనున్న  ఈ మూవీ నానీ  కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇక ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.

Leave a comment

error: Content is protected !!