కొన్ని సార్లు కొన్ని సినిమాలకు కొన్ని ప్రత్యేకతలు యాడ్ అవుతూ ఉంటాయి. అవి తలచుకున్నప్పుడల్లా.. ఓహో .. అప్పట్లోనే ఇలా చేశారా అని అనిపించకమానదు. అలాంటి ఒకే రకమైన రెండు సంఘటనలు అక్కినేని నాగేశ్వరరావు సినిమాల విషయంలో జరిగాయి. అక్కినేని సూపర్ హిట్ చిత్రాలు ఆరాధన, చదువుకున్న అమ్మాయిలు . ఈ రెండు సినిమాలకు సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు . అయితే ఈ రెండు సినిమాల పాటల చిత్రీకరణ విషయంలో రెండు తమాషా సంఘటనలు జరిగాయి. ఆరాధనలో నా హృదయంలో నిదురించే చెలీ అనే పాటలో అక్కినేని చేతులు పియానో మీద చాల ఫాస్ట్ గా , ప్రొఫెనల్ గా కదులుతాయి. అలాగే చదువుకున్న అమ్మాయిలు సినిమాలోని ఆడవాళ్ళ కోపంలో అందమున్నది పాటలో కూడా అక్కినేని పియానో వాయిస్తూ కనిపిస్తారు. అందులోనూ చేతులు క్లోజ్ లో కనిపిస్తాయి. అసలు సంగతి ఏంటంటే.. ఈ రెండు సీన్స్ లోని చేతులు అక్కినేనివి కాదు. సాలూరు రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావువి. ఆయన పియానో అద్భుతంగా వాయించేవారు. సహజత్వం కోసం .. ఆయన చేతుల్ని అక్కినేని చేతులు గా చూపించి.. జనానికి షాకిచ్చారు.