Shopping Cart 0 items - $0.00 0

సూపర్ స్టార్ కృష్ణ డేషింగ్ డెసిషన్ ?

 

 

ఏ ఇండ‌స్ట్రీలోనైనా ఫ్యాన్స్ స‌పోర్ట్ లేకుంటే ఎంతటి హీరో అయినా జీరో కావాల్సిందే. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బ‌ట్టే హీరోల సినిమాల‌కు క్రేజ్‌, హైప్‌, ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్పెరుగుతుంటుంది. అయితే ఫ్యాన్స్ మ‌న‌సులను గెలిచిన స్టార్ హీరోల్లో నెంబ‌ర్‌వ‌న్‌గా హీరో కృష్ణ‌ను చెప్పుకోవ‌చ్చు. చాలా విష‌యాల్లో ఫ్యాన్స్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానేసినిమాలు చేయ‌డం కానీ, నిర్ణ‌యాలు తీసుకోవ‌డం గానీ చేసిన హీరో కృష్ణ‌నే. ఫ్యాన్స్ మాట‌ను బ‌ట్టి ఓ డేరింగ్ డెసిష‌న్ తీసుకున్నార‌ట సూప‌ర్‌స్టార్ కృష్ణ‌.సూప‌ర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల‌ను హీరోయిన్ ని చేయాల‌ని చాలామంది మేక‌ర్స్ ట్రై చేసారు. సూప‌ర్‌స్టార్ కూడా మంజుల‌ను హీరోయిన్‌గా చూడాల‌నుకున్నార‌ట‌. కానీ ఈ డెసిష‌న్ ఫ్యాన్స్‌కు న‌చ్చ‌లేదు. బాల‌కృష్ణ‌, మంజుల కాంబినేష‌న్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లో టాప్ హీరోను అనౌన్స్ చేసారు. విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ కృష్ణారెడ్డి క‌టౌట్‌ను బెజ‌వాడ కాలువ‌లో ప‌డేసారు. అప్ప‌టికే కృష్ణ‌తో ఎస్వీ కృష్ణారెడ్డి సూప‌ర్ హిట్ మూవీ నెంబ‌ర్‌వ‌న్ తీసి వుండ‌టంతో ఈ అనౌన్స్ మెంట్‌కు విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. కృష్ణ ఫ్యాన్స్‌లో మాత్రం వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఫ్యాన్స్‌కు న‌చ్చ‌ని కార‌ణంగా కృష్ణ మంజుల‌ను హీరోయిన్ ని చేయాల‌న్న ఆలోచ‌న మానుకున్నారు. ఆ త‌రువాత మంజుల ప్రొడ్యూస‌ర్‌గా స‌క్సెస్ సాధించి డైరెక్ష‌న్ కూడా చేసారు. అడ‌పాద‌డ‌పా క్యారెక్ట‌ర్స్ చేస్తూ న‌టి కావాల‌నే ఆశ‌ను ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. మంజుల విష‌యంలో ఫ్యాన్స్ వ్య‌తిరేకించ‌డం క‌రెక్టా కాదా అన్న విష‌యం ప‌క్క‌న‌బెడితే ఫ్యాన్స్ మాట‌కు విలువ ఇచ్చిన హీరోగా సూప‌ర్‌స్టార్ కృష్ణ నిలిచాడు.

Leave a comment

error: Content is protected !!