చిత్రం : హనుమాన్
విడుదల తేదీ : జనవరి 12, 2024
నటీనటులు : తేజా సజ్జా, వరలక్ష్మీ శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రయ్, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం : అనుదీప్ దేవ్
నిర్మాత : నిరంజన్ రెడ్డి
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
బాలనటుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తేజా సజ్జా… హీరోగా జాంబిరెడ్డి తో తొలి ప్రయత్నం చేశాడు. అది మంచి సక్సెస్ సాధించింది. తర్వాత అద్భుతం సినిమాతో వచ్చినా అంతగా ఎస్టాబ్లిష్ కాలేదు. లేటెస్ట్ గా ఇప్పుడు హనుమాన్ అనే సూపర్ హీరో మూవీతో హీరోగా మరోసారి థియేటర్స్ లోకి వచ్చాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనానికి ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే. (Hanuman movie review)

కథ
అంజనాద్రి అనే ఊళ్ళో హనుమంతు (తేజా సజ్జా) ఒక ఆకతాయి అబ్బాయి. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఆ ఊరిపై కొందరు దౌర్జన్యం చేస్తూ ప్రజలను పీడిస్తుంటారు. అయితే పిరికివాడైన హనుమంతు వారిపై తిరగబడి వారిచేతిలో చావుదెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించిన విధంగా అద్బుత శక్తులు లభిస్తాయి. అయితే హనుమంతు విషయం తెలుసుకొన్న మైఖేల్ (వినయ్ రాయ్) ఆ ఊళ్ళో అడుగుపెడతాడు. ఇంతకీ.. అంజనమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు హనుమంతుకు ఉన్న బంధం ఏమిటి? మీనాక్షి (అమృతా అయ్యర్) కోసం హనుమంతు చేసిన సాహసం ఏమిటి? సముద్రంలో పడిపోయిన హనుమంతుకు అక్కడ ఏం జరిగింది? సూపర్ విలన్ మైఖేల్ దుర్మార్గాలకు హనుమంతు ఎలా చెక్ పెట్టాడు? ఈ క్రమంలో హనుమంతుడి అనుగ్రహాన్ని హనుమంతుకు ఎలా పొందాడు అన్నదే మిగతా కథ. (Hanuman movie review)

విశ్లేషణ
మైఖేల్ సూపర్ హీరోగా మారడానికి చిన్నతనంలో తన ఫ్యామిలీకి చేసిన ద్రోహంతో .. సినిమాను డిఫరెంట్ జోన్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు . హాలీవుడ్ ఫ్లేవర్‌ తో ఆ కథను అంజనాద్రికి తీసుకెళ్లి హనుమంతు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో రేసీగా పడతాయి సీన్స్. రుధిరమణి లభించిన తర్వాత కథ ఎమోషనల్‌గాను, అలాగే కామెడీ గాను సాగిపోతూ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. సత్య, గెటప్ శ్రీను కామెడీ జనానికి మంచి రిలీఫ్ ను ఇస్తుంది. ఓ సూపర్ ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచాడు డైరక్టర్. సెకండాఫ్‌లో మైఖేల్ కోణంలో కథను నడిపించడంతో ఇంట్రెస్టింగ్ జోన్‌లోకి వెళ్లిందనే చెప్పాలి. ఆఖరి 20 నిమిషాల సీన్స్ ను , క్లైమాక్స్ ఎక్ట్రార్డినరీగా ఉండటమే కాకుండా.. ప్రేక్షకులకు భక్తి భావంతో కూడిన ఎనర్జీని హైలెవల్‌లో ఇంజెక్ట్ చేశాడు. ఇంక.. ఈ సీక్వెల్‌కు లీడ్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను మరింతగా థ్రిల్ చేశాడు. (Hanuman movie review)

పెర్ఫార్మెన్సెస్
హనుమంతుగా తేజ సజ్జా తనకే తెలియని శక్తి ఆవహించిన యువకుడిగా, ప్రేమికుడిగా, సోదరుడిగా, ఊరి ప్రయోజనాలను కాపాడే పౌరుడిగా, ఆంజనేయస్వామి భక్తుడిగా పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. మీనాక్షిగా అమృత అయ్యర్, హనుమంతు సోదరి అంజనమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్, మైఖేల్‌గా వినయ్ రాయ్ తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఇక గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ మంచి కామెడీని పండించారు. (Hanuman movie review)

టెక్నీషియన్స్
వీఎఫ్ఎక్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి హనుమాన్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సీట్లకు, తెరకు అత్తుకుపోయేలా సినిమాను రూపొందిచారు. ఎడిటింగ్, ఇతర విభాగాలు పనితీరు బాగున్నాయి. తాను నమ్మిన కథను ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి అభినందించాల్సిందే. సినిమాపై ఉండే తన తపన, అభిరుచి ఏమిటో నిర్మాత చూపించారు. (Hanuman movie review)

బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ ఆకట్టుకునే విజువల్స్ మరియు VFX వర్క్ మెరుస్తుంది. ప్రారంభ సెటప్‌కు సమయం పడుతుంది, సినిమా చివర్లో ‘జై శ్రీ రామ్’ నామజపంతో , హనుమాన్ చాలీసాతో థియేటర్లు దద్దరిల్లుతాయి. 2025 లో దీని సీక్వెల్ ‘జైహనుమాన్’ కు లీడ్ ఇచ్చాడు దర్శకుడు. ఈ సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను , చిన్న పిల్లల్ని అలరించే సినిమాగా హనుమాన్ నిలిచిపోతుంది. (Hanuman movie review)
బోటమ్ లైన్ : సూపర్ హీరో ‘హనుమాన్’
రేటింగ్ : 3/5 

Leave a comment

error: Content is protected !!