Shopping Cart 0 items - $0.00 0

వెండితెర వెంగ్ సర్కార్ వచ్చేశాడు

బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ ‘83’ అనే క్రేజీ బయోపిక్ లో నటిస్తోన్న సంగతి   తెలిసిందే. 1983 లో ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకున్న మహత్తర ఘట్టాన్ని  ..  ఆ టీమ్ కు నాయకత్వం వహించి.. ఎందరో అభిమానుల గుండెల్లో  హీరో గా కొలువుండిపోయిన ఆల్ రౌండర్  కపిల్ దేవ్ కోణంలో తెరకెక్కిస్తున్నాడు కబీర్ ఖాన్. కపిల్ దేవ్ పాత్రలోకి  రణవీర్ సింగ్ పరకాయ ప్రవేశం చేస్తుండగా.. అతడి భార్య రోమీ భాటియాగా .. దీపికా పదుకొణే నటిస్తోంది.ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఇంకా ఈ సినిమాలో   మదన్ లాల్ గా హార్డీ సంధు , సునీల్ గవాస్కర్ గా తాహిర్ రాజ్ భాసిన్ , శ్రీకాంత్ గా తమిళ హీరో జీవా , సయ్యద్ కిర్మానీగా సాహిల్ ఖట్టర్, అమర్ నాథ్ గా సఖిబ్ సలీమ్ నటిస్తున్నారు. ఇక ఈ  మూవీలో  అప్పటి మరో  డైనమిక్  ప్లేయర్  వెంగసర్కార్ పాత్రను మరాఠీ నటుడు ఆదినాథ్ కొఠారే పోషిస్తున్నాడు.  ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను  ఈ రోజే విడుదల చేసింది మూవీ యూనిట్. అచ్చం వెంగసర్కార్ ను పోలిన అతగాడి లుక్  ..  బాలీవుడ్ ప్రేక్షకుల్నే కాకుండా.. క్రికెట్ ప్రేమికుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఫేమస్ డైరెక్టర్ ,యాక్టర్ అయిన ఆదినాథ్ కొఠారే వెంగసర్కార్ పాత్రతో భారతీయ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నడని బీ టౌన్ జనం చర్చించుకుంటున్నారు. మరి దిలీప్ గా ఆదినాథ్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!