Shopping Cart 0 items - $0.00 0

మక్కళ్ సెల్వన్

విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ . వైవిధ్యమైన కథాంశాలకు పెట్టింది పేరు. సహజమైన నటనకు పెట్టని కోట. అతడి పేరు విజయ్ సేతుపతి. తమిళ సినీ ప్రేక్షకులు అతడ్ని ‘మక్కళ్ సెల్వన్’ అని ముద్దుగా పిల్చుకుంటారు. అతి తక్కువ కాలంలోనే కోలీవుడ్ దర్శక, నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు అతడు. ఎలాంటి పాత్ర అయినా.. దానికి తనదైన శైలిలో జీవం పోసే ఆ హీరో .. పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు.  మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో రాజా పాండి  పాత్ర ద్వారా మరింతగా తెలుగు వారి ఆదరాభిమానాల్ని పొందాడు. త్వరలో పలు తెలుగు, తమిళ చిత్రాల్లో  విలన్ గా కూడా నటించబోతున్నాడు. ఆల్రెడీ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ గా ఫిక్సయిన విజయ్ సేతుపతి ..త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న సుక్కు, బన్నీ చిత్రంలో కూడా విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది.

అకౌంటెంట్ గా జీవితాన్ని ఆరంభించిన విజయ్ సేతుపతి, దుబాయ్ లో కొన్నాళ్ళు పనిచేశాడు.  కానీ, ఆ పని నచ్చక, సొంతంగా డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో బాగా ఎదుగుతున్న సమయంలో సినిమా అవకాశం వచ్చింది.  అలా వచ్చిన అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకున్నాడు.  2010లో మొదటి లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది.  ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో విజయ్ సేతుపతి వెలుగులోకి వచ్చాడు.  ఆపై..  శశికుమార్ ‘సుందర పాండియన్’ సినిమాలో విలన్ రోల్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘పిజ్జా’ చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేసి.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హీరోగా ఎదుగుతూ వచ్చాడు.  ఇప్పుడు తమిళ నాట ప్రతీ చిత్రంతోనూ తనదైన వైవిధ్యత చూపిస్తూ.. దూసుకుపోతున్నాడు. నేడు విజయ్ సేతుపతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మక్కళ్ సెల్వన్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!