Shopping Cart 0 items - $0.00 0

బన్నీ – సుక్కు మూవీ టైటిల్ ‘శేషాచలం’…?

 

‘అల వైకుంఠపురములో’ మూవీ బ్లాక్ బస్టర్ హ్యాంగోవర్ లో ఉన్నాడు అల్లు అర్జున్. దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమాపైనే అందరి దృష్ణి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో  బన్నీ తదుపరి చిత్రాన్ని లైన్ లో పెట్టుకున్నసంగతి తెలిసిందే.  ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథతో.. శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ సినిమాకి ‘శేషాచలం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు .. త్వరలోనే  అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి వార్తలొస్తున్నాయి.

రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ అనే సాఫ్ట్ టైటిల్ తో  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సుక్కూ.. ఇప్పుడు బన్నీకి కూడా అదే తరహాలో ‘శేషాచలం’ అనే సాఫ్ట్ టైటిల్  తో సినిమా తెరకెక్కించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఆర్య’ సిరీస్ తో బన్నీ సుక్కుల కాంబో అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి ఓ యాక్షన్ మూవీ చేయనుండడం అంతటా ఆసక్తిగా మారింది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనున్న ఈ  మూవీలో రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోంది.. అంతేకాదు .. ఈ మూవీలో తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు కూడా. ‘అల వైకుంఠపురములో’ మూవీతో బన్నీ.. రంగస్థలం సినిమాతో సుకుమార్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి.  ఇన్ని ప్రత్యేకతలతో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ‘శేషాచలం’..  ‘రంగస్థలం’ లాగానే .. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తుందేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!