భారత క్రికెట్ చరిత్రలో 1983వ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఎవరూ మరిచిపోలేనిది. ఆ సంవత్సరమే ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకుంది. కానీ ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. జట్టులోని పలువురు ఆటగాళ్ళు అసాధ్యమైన కొన్ని ఫీట్స్ చేసి .. యావత్తు ప్రపంచం గర్వపడేలా వరల్డ్ కప్ ను ఇండియాకు అందచేశారు. అలాంటి ఆటగాళ్ళలో ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుండెల్లో ప్రతిష్టించుకున్న హీరో కెప్టెన్ కపిల్ దేవ్. అలాంటి అసాధారణమైన ఘట్టాన్ని బాలీవుడ్ తెరమీద ఆవిష్కరిస్తున్నాడు దర్శకుడు కబీర్ ఖాన్. సినిమాపేరు ‘83’.

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ మూవీని నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్నిఏప్రిల్ 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తెలుగులో `83` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చెన్నై లో విడుద‌ల చేశారు.  మాజీ ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ క‌పిల్ దేవ్‌, మాజీ క్రికెట‌ర్ శ్రీకాంత్, యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌, బాలీవుడ్ స్టార్ ర‌ణ్వీర్ సింగ్‌, డైరెక్ట‌ర్ క‌బీర్ సింగ్‌, హీరో జీవా, వై నాట్ స్టూడియోస్ శ‌శికాంత్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!