Shopping Cart 0 items - $0.00 0

ది బాయ్ నెక్స్ట్ డోర్

 

అందమైన ముఖం.. ఆకట్టుకునే కళ్ళు.. ఆకర్షించే నవ్వు.. అన్నీ కలిసి ఒక్క చోట చేరితే నాగశౌర్య. మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో  లేక వెనకింట్లోనో ఉండే అబ్బాయిలా అనిపిస్తాడు. అందుకే అమ్మాయిలకు అంతగా నచ్చుతాడు. సహజమైన పాత్రలతో , వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ లవర్ బాయ్ గా ముద్ర పడ్డ  అతగాడు.. టాలీవుడ్ లో హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తెలుగు తెరపై స్టార్ హీరో అవ్వాలనే పట్టుదల , కృషి నిండుగా మెండుగా కలవాడు.

2011 లో ‘క్రికెట్ గాళ్ళ్ అండ్ బీర్’ టాలీవుడ్ లో నటుడిగా రంగప్రవేశం చేసిన నాగశౌర్య .. ఆ తర్వాత ‘చందమామ కథలు’ అనే మూవీలో ప్రముఖ పాత్ర పోషించాడు. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి .. మొట్టమొదటి కమర్షియల్ హిట్టు కొట్టాడు. ‘దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీరావే మా ఇంటికి , జాదూగాడు‘  లాంటి మూవీస్ తో యూత్ ను ఆకట్టుకున్నాడు.  ఐరా క్రియేషన్స్ పేరుతో సొంతంగా బ్యానర్ స్థాపించి .. ‘ఛలో. @నర్తనశాల’ లాంటి  సినిమాలతో విజయం సాధించాడు. ఇప్పుడు ‘అశ్వత్థామ’ అనే కాన్సెప్ట్ బేస్డ్ యాక్షన్ మూవీతో త్వరలో రాబోతున్నాడు. అతడు  ఇంకా మరెన్నో విజయాలతో హీరోగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.   నేడు నాగశౌర్య పుట్టిన రోజు .. ఈ సందర్భంగా అతడికి విషెస్ చెబుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే నాగశౌర్య.  

Leave a comment

error: Content is protected !!