Shopping Cart 0 items - $0.00 0

అఘోరా గా బాలయ్య?

యన్టీఆర్ సిరీస్, రూలర్ చిత్రాలతో వరుస పరాజయాల్ని మూటగట్టుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ.. తదుపరి చిత్రాన్ని బోయపాటితో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ మూవీస్ తో వరుస విజయాల్ని నమోదుచేసుకున్న ఈ ఇద్దరి కాంబో .. ఇప్పుడు హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రం నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాదు ఈ సారి బాలయ్య కు బోయపాటి ఏ రేంజ్ లో  పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేశాడనే విషయం కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తోన్నట్టు తెలుస్తోంది. అందులో ఒక పాత్ర అఘోరా గా కనిపిస్తుందని సమాచారం.  రీసెంట్ గా బోయపాటి లొకేషన్స్ ఎంపిక కోసం వారణాశి వెళ్ళొచ్చాడు.  కథలో భాగంగా వచ్చే వారణాశి సీన్స్ లో బాలకృష్ణ అఘోరాగా తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడని.. ఆ పాత్ర సినిమాకే హైలైట్ గా మారనుందని తెలుస్తోంది. దానికి బాలకృష్ణ రీసెంట్ గుండు గెటప్ కూడా ఈ వార్తకు బలం చేకూర్చుతోంది. ‘నేను దేవుణ్ణి’ చిత్రం కోసం తమిళ హీరో ఆర్య అఘోరాగా నటించిన సంగతి తెలిసిందే. అతడి తర్వాత అఘోరా గా కనిపించే హీరో బాలయ్యే అవడం విశేషం. వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ తో నిరాశ చెందిన బోయపాటి , మూడు వరుస పరాజయాలు ఎదుర్కొన్న బాలయ్య .. ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!