మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో వచ్చిన సూపర్ హిట్ రివెంజ్ యాక్షన్ డ్రామా ‘చట్టానికి కళ్ళులేవు’. శ్రీధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంకినేని సత్యనారాయణ నిర్మాణంలో, అట్లూరి పూర్ణచంద్రరావు సమర్ఫణలో .. యస్.ఏ.చంద్రశేఖర్ దర్వకత్వంలో 1981లో  తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం  సాధించింది. మాధవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇంకా లక్ష్మి, కన్నడ ప్రభాకర్, హేమసుందర్, సిలోన్ మనోహర్, రమణమూర్తి, ప్రభాకరరెడ్డి , పండరీబాయి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కృష్ణ చక్ర సంగీతం అందించగా.. మైలవరపు గోపి మాటలు రాశారు.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, విజయ్ అక్కా తమ్ముళ్ళు. ఇద్దరూ చిన్నతనంలో తమ తండ్రి మరణానికి కారణమైన జాన్, జావెద్, జనార్ధన్ అనే ముగ్గురు హంతకుల కోసం వెతుకుతుంటారు. దుర్గ వాళ్ళు చేసిన నేరాలు కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయాలని చూస్తుంటుంది. కానీ విజయ్ కి మాత్రం చట్టంలో లొసుగుల వల్ల వాళ్ళను ఎప్పటికీ పట్టులేమనే నమ్మకం ఉంటుంది. ఎలాగైనా చట్టం కళ్ళు గప్పి ఒక్కొక్కరిని మట్టు పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. తెలివిగా పథకం వేసి జాన్, జనార్ధన్ లను మట్టు పెడతాడు. ఈ కేసు విచారణ చేస్తున్న దుర్గకు ఆటంకం కలుగుతుంది. తమ్ముడి మీద అనుమానం కలుగుతుంది కానీ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకవు. చివరికి దుర్గ జావెద్ అక్రమాలని పసిగట్టి అతన్ని అరెస్టు చేయడానికి వెళుతుంది. జావెద్ ఆమెను అపహరిస్తాడు. సమయానికి విజయ్ వచ్చి ఆమెను కాపాడి అతన్ని చంపడంతో కథ ముగుస్తుంది. నిజానికి ఈ సినిమా తమిళ సినిమా ‘చట్టం ఒరుఇరుట్టరై’ కి రీమేక్ వెర్షన్. విజయ్ కాంత్  హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్టైంది.  

 

Leave a comment

error: Content is protected !!