నటభూషణ్ శోభన్ బాబు నటించిన యాక్షన్ చిత్రాల్లో చాలా భిన్నమైనది ‘బలిదానం’. యస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవి కథానాయికగా నటించింది. 1982లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కైకాల సత్యనారాయణ, హార్స్ మన్ బాబు తదితరులు నటించిన ఈసినిమా చిరంజీవి నటించిన యమకింకరుడు సినిమాను పోలి ఉంటుంది.

పోలీసాఫీసర్ అయిన శోభన్ బాబు..ఇంట్లో వారిని ఎదురించి మాధవిని పెళ్ళి చేసుకుంటాడు. అయితే నగరంలో ఒక క్రిమినల్ గ్యాంగ్ బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. వారి ఆటకట్టించేందుకు పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఆ గ్యాంగ్ లీడర్ .. శోభన్ బాబు ఫ్యామిలీకి థ్రెట్ గా మారతాడు. ఆ ప్రయత్నంలో హీరో తన బిడ్డను పోగొట్టుకుంటాడు. చివరికి ఆ క్రిమినల్ ను చట్టానికి పట్టించడమే మిగతాకథ. నిజానికి ఈ సినిమా రక్తం మలయాళ సినిమాకి రీమేక్ వెర్షన్. అలాగే అదే సినిమాను హిందీలో జితేంద్రతో బలిదాన్ గా రీమేక్ చేశారు.

Leave a comment

error: Content is protected !!