మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో నటించిన హిట్ చిత్రం ‘లవ్ ఇన్ సింగపూర్’. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ పతాకంపై యమ్. వెంకట రమణకుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఓ.యస్.ఆర్ ఆంజనేయులు దర్శకత్వం వహించారు. 1980లో విడుదలైన ఈ సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రంగనాథ్ మెయిన్ హీరోగా నటించిన ఈ సినిమాలోకథానాయికగా లత నటించగా..  ముక్కామల, మలయాళ నటుడు జోస్ ప్రకాశ్ , మెడ్లిన్, హేమసుందర్, పి.జే.శర్మ, అత్తిలి లక్ష్మి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఆంధ్రాలోని ఒక గ్రామంలో కాళీమాత వజ్రఖడ్గాన్ని దొంగిలించి .. సింగపూర్ తరలిస్తారు కొందరు విద్రోహులు. ఆ కేసు సిబిఐకి అప్పగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కేసు ను పరిష్కరించి వజ్రఖడ్గాన్ని తిరిగి మనదేశానికి తీసుకొని రావడానికి సిబిఐ ఆఫీసర్ ప్రేమ్ ను నియమిస్తుంది సిబిఐ. ప్రేమ్ సింగపూర్ పయనమవుతాడు. ఆ క్రమంలో చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయిన తన తమ్ముణ్ణి కలుసుకొని ఇద్దరూ ఆ ఖడ్గాన్ని ఇండియా తరలించడమే సినిమా కథ. ఈ సినిమాలోని మూడొంతుల భాగాన్ని సింగపూర్ లో చిత్రీకరించారు.  1980లో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి మలయాళంలో సూపర్ హిట్టైన లవ్ ఇన్ సింగపూర్ చిత్రానికి రీమేక్ వెర్షన్. ప్రేమ్ నజీర్, జయన్, జోష్ ప్రకాశ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి  చిరంజీవి డ్యాన్స్ , ఫైట్స్ ప్రధాన ఆకర్షణ. శంకర్ గణేశ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

Leave a comment

error: Content is protected !!