సినిమా అంటే మిక్స్‌డ్ ఎమోషన్స్‌ను పర్‌ఫెక్ట్‌గా పేర్చి అందమైన ముగింపో అర్ధవంతమైన ముగింపో ఇవ్వడం.. ఈ లైన్‌ ను కరెక్ట్‌గా ఫాలో అవుతూ ఎమోషన్స్‌ను పర్‌ఫెక్ట్‌ గా ప్రజెంట్‌ చేస్తూ.. అసభ్యతకు అశ్లీలతకు అస్సలు తావివ్వకుండా సినిమాలు తీస్తూ సాగుతున్నాడు శ్రీనివాస్‌ అవసరాల. నటుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకోవడమే కాదు.. తనలో ఉన్న దర్శకుడిని కూడా పరిచయం చేసాడు. మాస్సివ్‌ కమర్షియల్ ట్రాక్‌ కాకుండడా.. క్లాసిక్‌ టచ్‌తో ఎమోషనల్ జర్నీని విజువలైజ్చేస్తాడు. అలాంటి సినిమానే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. నాగశౌర్య, మాళవికా నాయర్‌ జంటగా పీపుల్‌ మీడయా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

హీరో హీరోయిన్ల ప్రేమప్రయాణంలో ఉండే ఎమోషన్స్‌ను అవసరాల శ్రీనివాస్‌ అద్భుతంగా తెరకెక్కించినట్టు ప్రీరిలీజ్‌ వేడుకకు వచ్చిన అతిథులు ప్రశంసించారు. ఈ వేడుకలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ట్రైలర్‌ రిలీజ్‌ చేసారు. కళ్యాణిమాలిక్‌ ఫీల్‌గుడ్‌ పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ క్లాసిక్‌ టచ్‌తో హృదయానికి హత్తుకునేలా ఉంది. సునీల్‌కుమార్‌ నామ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ను ఘనంగా నిర్వహించారు. యువ హీరో అడివి శేష్, నిర్మాతలు అశ్వినీదత్, సునీల్ నారంగ్, రవి శంకర్, దామోదర ప్రసాద్, కోన వెంకట్, దర్శకులు బాబీ కొల్లి, మారుతి, నందిని రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

నటీనటులు – నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు – – శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
డీవోపీ – సునీల్ కుమార్ నామ
సంగీతం – కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ – భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ – కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ – అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ – శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ – అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ – హర్ష చల్లపల్లి
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్

Leave a comment

error: Content is protected !!