సింహం కడుపున సింహమే పుడుతుంది. ఈ మాట అన్నదమ్ముల అనుబంధం షూట్ టైమ్‌లో బాలకృష్ణ నటనను చూసి చెప్పిన మాట. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ లాగా సాంఘీక,పౌరాణిక, జానపద ఇంకా ఎన్నో జానర్స్ మూవీస్‌లో యాక్ట్ చేసాడు. అటు బాక్సాఫీస్ రేసులోనూ ఇటు ఆడియెన్స్ హార్ట్స్‌ను గెలిచాడు. బాలయ్య కెరీర్‌లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్చేసాడు. అందులో డబుల్ ఫోటో రికార్డ్ ఒకటి. ఆ రికార్డ్ విషయానికొస్తే.. అపూర్వ సహోదరులు, రాముడు భీముడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆదిత్య 369, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం,పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరి పిడుగు, ఒక్క మగాడు, పాండు రంగడు, సింహ, పరమ వీర చక్ర, లెజెండ్ లాంటి చిత్రాల్లో బాలయ్య డ్యూయెల్ రోల్ చేసాడు. వీటితోపాటు అధినాయకుడు మూవీలో ట్రిపుల్ రోల్ చేసాడు బాలయ్య.కెరియర్‌లో బాలయ్య డ్యూయెల్ రోల్ చేసిన మూవీస్ కౌంట్ 16. ఇది ఖచ్చితంగా రికార్డే. బాలయ్య సమకాలీన హీరోలు కానీ, ప్రజెంట్ స్టార్స్ కానీ ఈ రికార్డ్ ను బీట్ చేయడంఅంత ఈజీకాదు. డబుల్ ఫోటో రికార్డ్‌కు బాలయ్య వన్ అండ్ ఓన్లీ కింగ్ అని చెప్పొచ్చు.