Matkaking : బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ యాక్టింగ్ టాలెంట్ అందరికీ తెలిసిందే. “ఎంసీఏ” సినిమాతో విలన్ గా తెలుగులోకి అడుగుపెట్టిన ఈ నటుడు, విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా, “మట్కా కింగ్” అనే క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాకు “సైరత్” లాంటి బ్లాక్ బస్టర్ తీసిన .. మరాఠీ దర్శకుడు నాగరాజు మంజులే దర్శకత్వం వహిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా జూన్ 12న ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా, చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు విజయ్ వర్మ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం.

ఈ చిత్రం ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రాబోతున్నట్లు దర్శకుడు నాగరాజు మంజులే తెలిపారు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను గార్గి కులకర్ణి, ఆశిష్ ఆర్యన్, అశ్విని సిద్వానీలతో కలిసి సిద్ధార్థ్ రాయ్ కపూర్, నాగరాజ్ మంజులే నిర్మిస్తున్నారు. కృతిక కమ్రా, సాయి తంహంకర్, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!