Shopping Cart 0 items - $0.00 0

మెగా ప్రిన్స్

 

 

పెదనాన్న మెగాస్టార్ .. బాబాయ్ పవర్ స్టార్ .. అన్న మెగా పవర్ స్టార్ .. బావ స్టైలిష్ స్టార్ .. ఇంకో బావ సుప్రీమ్ స్టార్ .  ఇందరి స్టార్స్ మధ్య అందరూ తలెత్తి చూసేలా తానూ  ఒక స్టార్ గా మారిన అతడు .. ‘మిస్టర్’ వరుణ్ తేజ. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ  హ్యాండ్ సమ్ బాయ్.. నాన్న హైట్ ను , పెదనాన్న కామెడీ టైమింగ్ ను పుణికి పుచ్చుకొని మెగాభిమానుల గుండెల్లో ప్రిన్స్ గా మారాడు. వైవిధ్యమైన కథాంశాలతో..  విలక్షణమైన పాత్రలతో అన్ని రకాల జోనర్స్ లోనూ సినిమాలు చేసి.. ఇప్పుడు టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.

2014 లో ‘ముకుంద’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ .. తన బాబాయ్ లాగానో, తన అన్నలాగానో లేక తన బావ లాగానో .. కేవలం యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకుల మనసుల్ని రంజింపచేయాలని ముందు నుంచీ కోరుకోలేదు.  కథలో కొత్త దనం ఉంటే తన ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి.. పాత్రకే పట్టం గట్టి.. హీరోగా ఎదగాలని తాపత్రయ పడ్డాడు. ఆ ప్రయత్నంలో ‘తొలి ప్రేమ, ఫిదా, ఎఫ్ 2,  గద్దల కొండ’ గణేష్ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి.. టాలీవుడ్ లో  తనకో ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. త్వరలో బాక్సింగ్ నేపథ్యంలోని కథతో ఒక వెరైటీ సినిమా కోసం  ప్రత్యేకంగా  ట్రైనింగ్ కూడా తీసుకొని రెడీ అవుతున్నాడు వరుణ్ తేజ. ఇవే కాకుండా.. మరిన్ని మంచి కథలతో సినిమాలు చేసేందుకు ఈ ఏడాది సిద్ధమవుతున్నాడు. నేడు వరుణ్ తేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ మెగా ప్రిన్స్ కు బర్త్ డే విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!