Maharaja : తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్  సేతుపతి నటించిన ‘మహారాజా’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు నితిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా, ఓటీటీలో కూడా ఈ చిత్రం తన దూకుడును కొనసాగిస్తూ ఉంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘మహారాజా’ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడ్డ సినిమాగా నిలిచింది. ఏకంగా 18.6 మిలియన్ వ్యూస్‌తో ఈ చిత్రం టాప్ స్థానాన్ని దక్కించుకుంది.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మనోహరమైన సంగీతం అందించారు.

‘మహారాజా’ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. విజయ్ సేతుపతి నటన, నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం మరియు అద్భుతమైన కథాంశం కలిసి ‘మహారాజా’ చిత్రాన్ని ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. థియేటర్లతోపాటు ఓటీటీలో కూడా ఈ చిత్రం సృష్టిస్తున్న రికార్డులు దీనికి నిదర్శనం.

Leave a comment

error: Content is protected !!