Shopping Cart 0 items - $0.00 0

‘నారప్ప’గా వెంకీ…?

 

 లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 2, వెంకీమామ’ మూవీస్ తో వరుసగా సక్సెస్ సాధించి ఫుల్ జోష్ లో  ఉన్నాడు వెంకటేశ్. ప్రస్తుతం నెక్స్ట్ మూవీని  సెట్స్ మీదకు తీసుకెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడు. తమిళ బ్లాక్ బస్టర్  ‘అసురన్’ మూవీని తెలుగులో వెంకీతో రీమేక్ చేస్తున్నారు సురేశ్ ప్రొడక్షన్స్ వారు. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.   ఒక గ్రామంలో భార్య, ఇద్దరు కొడుకులతో జీవనం సాగిస్తూంటాడు  ఒక తండ్రి. ఒక తగాదాలో పెద్ద కొడుకును పోగొట్టుకుంటాడు. అదే గొడవ కారణంగా ఆపదలో పడిన  చిన్నకొడుకును కాపాడుకోవడానికి అతడు ఏం చేశాడన్నదే  ‘అసురన్’  కథ.

‘అసురన్’ ఒరిజినల్ వెర్షన్ లో ధనుష్ శివసామిగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.  అదే పాత్రను వెంకీ ఎలా రక్తికట్టిస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఈ మూవీకి ‘నారప్ప’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట నిర్మాతలు.  పక్కా గ్రామీణ వాతావరణంలో సాగే సినిమా కాబట్టి .. ఆ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట. మరో రెండు రోజుల్లో అనంతపురంలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీకి  తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. మరి ‘నారప్ప’గా వెంకీ ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!