ఇటీవల “ఫ్యామిలీ స్టార్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు – శిరీష్ నిర్మాణంలో, రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించే ఈ చిత్రం దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లో 59వ చిత్రం. “రాజావారు రాణిగారు” ఫేమ్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి డైరెక్టర్. “ఇది ఒక లార్జర్ దెన్ లైఫ్ రూరల్ యాక్షన్ డ్రామా” అని మేకర్స్ పేర్కొన్నారు. మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజున సందర్భంగా మరిన్ని అప్డేట్స్ రాబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్, దిల్ రాజు, రవి కిరణ్ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతేడాది సెప్టెంబర్ లోనే రవి కిరణ్ కోలాతో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన దిల్ రాజు, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను #SVC59 గా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రూపొందించనున్నారు.
“రాజావారు రాణిగారు” వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో అందరి దృష్టిని ఆకర్షించిన రవి కిరణ్ కోలా, ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న రూరల్ మాస్ యాక్షన్ డ్రామాతో మరో విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాతో నిరాశ పరిచిన విజయ్ దేవరకొండ, #SVC59 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ తో పాటుగా నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి ఇతర వివరాలు మే 9న వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!