మెగా హీరోల్లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నది వరుణ్ తేజా అనే చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 2, అంతరిక్షం, గద్దలకొండ గణేశ్’ చిత్రాలతో మంచి విజయాలు ఖాతాలో వేసుకున్న ఈ హీరో ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘బాక్సర్’ అనే మూవీలో నటిస్తున్నాడు. దాని కోసం ప్రత్యేకంగా బాక్సింగ్ కూడా సాధన చేశాడు. వైవిధ్యమైన చిత్రాలతో .. విభిన్నమైన పాత్రలు పోషించి.. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో .. ఇప్పుడు బ్రాండ్స్, అండార్స్ మెంట్స్ వింగ్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు.

ఇప్ప‌టికే ప‌లు దేశియ బ్రాండ్స్‌కి అండార్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్ర‌ముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జున సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు అంగీక‌రించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను నాగార్జున సిమెంట్స్ వారు అధికారికంగా విడుద‌ల చేశారు. ప్రతీ సౌధంలో మొనగాడై నిలిచే నాగార్జున సిమెంట్స్ అనే పోస్టర్ పై స్టైలిష్ లుక్ లో వరుణ్ తేజ కనిపించే యాడ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Leave a comment

error: Content is protected !!