గెట్ అప్ శ్రీను హీరోగా నటిస్తున్న చిత్రం రాజు యాదవ్‌. ఇదే అతడికి హీరోగా ఎంట్రీ మూవీ. ఇందులో అతను టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ను తేజా సజ్జా చేతుల మీదుగా లాంచ్ చేశారు.

క్రికెట్ గ్రౌండ్‌లో హీరో ఫీల్డింగ్ చేయడంతో ట్రైలర్ ప్రారంభమైంది. అతనికి తన ముఖ కండరాలను కదిలించలేని పరిస్థితికి దారితీసేలా బంతి తగులుతుంది. దాంతో ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తాడు. ఆపరేషన్‌కి లక్షలు కావాలి. అతడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడక పోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి.

దర్శకుడు కృష్ణమాచారి వినోదం , భావోద్వేగాలను సరిగ్గా బ్యాలెన్స్ చేసి పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. గెట్ అప్ శ్రీను వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు. అంకితా ఖరత్ అతని లేడీ లవ్‌గా నటించింది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించారు. మే 17న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Leave a comment

error: Content is protected !!