ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా.. ఇది పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ కు తగ్గట్టే ఇప్పుడున్న ట్రెండ్ లో ఫాస్ట్‌గా దూసుకెళ్తున్నారు. అన్ని వేళలా వేగం పనిచేయదు. కొన్ని సందర్భాల్లో నిదానమే ప్రధానం అనే మాట వింటూనే వుంటాం. ఒక్కొక్కరూ ఒక్కో సిద్దాంతాన్ని ఫాలో అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్‌లో స్లోగా ఆడి సెంచరీ చేసేవారు కొందరైతే.. దూకుడుగా ఆడి తక్కువ బాల్స్‌లో సెంచరీ చేసేవారు కొందరు. 52 బాల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్ కొహ్లీ మీద వుంది. ఇక సినిమాల విషయానికొస్తే కొందరు చాలా ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటూ పోతారు. మరి కొందరు ఆచి తూచి సినిమాలు చేస్తుంటారు. అయితే టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో హండ్రెడ్ మూవీస్ చేసినవారున్నారు. ఇప్పుడైతే కష్టం కానీ అప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేసేవారు స్టార్స్. ఇప్పటివరకు మన స్టార్స్‌లో చాలా మంది వంద సినిమాలు కంప్లీట్ చేసినవారున్నారు. ఇందులో ఎఎన్నార్ 23 సంవత్సరాల్లో 100 మూవీస్ కంప్లీట్ చేయగా ఎన్టీఆర్ 12 సంవత్సరాల్లో వంద సినిమాలు కంప్లీట్ చేసాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల్లో వంద సినిమాలు కంప్లీట్ చేసాడు. అయితే వీరందరి కంటే తక్కువ టైమ్‌లో అంటే 9 సంవత్సరాల్లోనే వంద సినిమాలు చేసిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ ఫాస్టెస్ట్ రికార్డ్‌ను బద్దలు కొట్టడం ప్రజెంట్ వున్న స్టార్స్ కు అసాధ్యమనే చెప్పాలి.