Shopping Cart 0 items - $0.00 0

నితిన్ ఫీలవలేదు కానీ.. బన్నీ ఫీలయ్యాడు

యూత్ ని ఎట్రాక్ట్ చేసిన చిత్రాల్లో బ‌న్నీ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య ఒక‌టి. ఫీల్ మై ల‌వ్ అంటూ వ‌చ్చిన ఈ మూవీ బ‌న్నీ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌లా నిలిచింది. ఇంత‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ఈ మూవీ హీరో నితిన్ కి న‌చ్చ‌లేదు. అదేంటి అంద‌రికీ న‌చ్చిన ఈ మూవీ నితిన్ కు ఎందుకు న‌చ్చ‌లేదు అనుకుంటున్నారా..? నిజంగానే ఈ మూవీ నితిన్ కి కనెక్ట్ అవ్వ‌లేదు.
అస‌లేం జ‌రిగిందంటే.. ఆది మూవీ హిట్ త‌ర్వాత వినాయ‌క్ దిల్ మూవీ తీస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో వ‌ర్క్ చేస్తున్న సుకుమార్ నితిన్‌కి ఒక క‌థ చెప్తాన‌ని ప్రొడ్యూస‌ర్ రాజుని అడిగారు. ఆయ‌న ఒకె అన‌డంతో ఆర్య మూవీ క‌థ‌ని నితిన్‌కు చెప్పారు సుకుమార్‌. ఎందుకో నితిన్ ఓకె చెప్ప‌లేదు. కానీ రాజుకు మాత్రం విప‌రీతంగా న‌చ్చేసింది. దిల్ మూవీ త‌ర్వాత సుకుమార్ ని పిలిపించి బ‌న్నీ తో తీసారు దిల్ రాజు. అలా ఆర్య‌ను మిస్ అయ్యాడు నితిన్‌.

Leave a comment

error: Content is protected !!