Shopping Cart 0 items - $0.00 0

శంకర్ సినిమాకి నో చెప్పారా?

 

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఖ్యాతిని పెంచిన డైరెక్ట‌ర్స్ లో శంక‌ర్ ఒక‌రు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన జీన్స్ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించుకుంది. ఈ సినిమా ప్ర‌శాంత్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకి ముందుగా అనుకున్న హీరో మాత్రం ప్ర‌శాంత్ కాదు. జీన్స్ కోసం శంక‌ర్ అనుకున్న హీరో అబ్బాస్‌. అప్ప‌టికి ప్రేమ‌దేశం హిట్‌తో అటు కోలీవుడ్ , టాలీవుడ్‌ల‌లో బాగా ఫేమ‌స్ అయ్యాడు. అప్ప‌ట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ చాలా ఫేమ‌స్ అయ్యింది. ఇంత క్రేజ్ ఉన్న అబ్బాస్ తో జీన్స్‌ను తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేసాడు శంక‌ర్. ప్రేమ‌దేశం హిట్‌తో వరుస సినిమాల‌ను ఒప్పుకున్న అబ్బాస్ జీన్స్ మూవీకి డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక శంక‌ర్ కు నో చెప్పాడు. అబ్బాస్ త‌ర్వాత శంక‌ర్ నెక్ట్స్ ఛాయిస్ కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్‌. అయితే అజిత్ కూడా వ‌రుస సినిమాల‌తో బిజీగా వుండ‌టం వ‌ల‌న డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక శంక‌ర్ ఆఫ‌ర్‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. అబ్బాస్, అజిత్‌ల డేట్స్ ప్రాబ్ల‌మ్ కార‌ణంగా ఓకే చేయ‌క‌పోవ‌డంతో శంక‌ర్ ప్ర‌శాంత్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ మూవీలో యాక్ట్ చేయ‌డం కోసం ప్ర‌శాంత్ ఏకంగా ఏడు సినిమాల‌ను వదులుకోవ‌డం విశేషం.

Leave a comment

error: Content is protected !!