గ్లామర్‌క్వీన్‌ అప్సరరాణి మెయిన్‌లీడ్‌తో రాబోతున్న చిత్రం ‘తలకోన’. ఈ చిత్రాన్ని అక్షర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నగేష్‌ నారదాసి డైరెక్షన్‌లో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని రిలీజ్‌ కు సిద్దంగా ఉంది. ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసింది చిత్ర యూనిట్. క్రైమ్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రం మార్చి 29 న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.


ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ.. అడవి అందాలతో పాటు మరో కోణాన్ని కూడా ఆవిష్కరించబోతుందని చెప్తున్నారు మేకర్స్. పాలిటిక్స్, మీడియాతో పాటు ప్రకృతిలో జరిగే ఎన్నో అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. టెక్నికల్‌గా ఈ సినిమా హైస్టాండర్డ్స్‌తో ఉంటుందని చెప్తున్నారు.
థ్రిల్లింగ్ సస్పెన్స్ తో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!