నటీనటులు : శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘు బాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు
ప్రొడ్యూసర్ :- మహముద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం :- వడత్యా హరీష్
మ్యూజిక్ :- నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ :-అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ :- గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్ :- మహముద్ ఖాన్
విడుదల తేది : 12-11-2021

కుటుంబ కథా చిత్రాలు, కమర్శియల్ చిత్రాలతో ఆకట్టుకున్న హీరో శ్రీకాంత్ కొంత కాలంగా తన బాడి లాంగ్వేజ్ కి సరితూగే పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నారు.. తాజాగా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమ వీరుడు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘తెలంగాణ దేవుడు’చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాత్ర (విజయ్ దేవ్ )గా చాలెంజింగ్ రోల్ పోషించాడు.. ఆ పాత్రను ఎలా మెప్పించాడు?… శ్రీకాంత్ తో పాటు ఈ చిత్రం తోనే వెండితెరకు పరిచయమైన జీషాన్ ఉస్మాన్ ఎలా నటించాడు? ఇతర పాత్రధారులు, సాంకేతిక నిపుణులు ఏ మేరకు వారి నైపుణ్యాలను ప్రదర్శించారు? ఈ చిత్ర కథా కథనాలు ఎలా ఉన్నాయో సమీక్షలో చూద్దాం.

 

కథ  :

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు తొలి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బంగారు తెలంగాణ పార్టీ అధినేత విజయ్ దేవ్ (శ్రీకాంత్ )ను, టీవీలో చూసిన ఓ పెద్దాయన ఆనందంతో ఉప్పొంగి పోతుంటే, తన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనై కారణమడుగుతారు… ఆ పెద్దాయన దృష్టి కోణంలో ఈ కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 1969లో తెలంగాణా పరిస్థితులు ఎంత దయనీయంగా ఉండేవో, పరాయి పాలనలో ఎన్నికష్టాలు పాడ్డారో చూస్తూ పెరుగుతున్న విజయ్ దేవ్(జీషాన్ ఉస్మాన్) బాల్య దశ నుంచే తెలంగాణ భూములు, ప్రజలు, సంస్కృతి, సాంప్రదాయాలు, భాషాసాహిత్యాలు పరాయి పాలనలో ఎంతో నిరాదరణకు గురవుతున్నాయని, అస్థిత్వాన్ని కోల్పోతున్నాయని గ్రహించిన విజయ దేవ్, తాను పెద్దయ్యాక నాయకుడినై తెలంగాణను ఆదుకుని, ఆత్మగౌరవ భావుటనై, ప్రజల గుండెల్లో కొలువుంటానని తన తల్లిదండ్రులకు చెబితే, వాళ్ళు ముందు భయపడినా, తర్వాత ఆశీర్వదిస్తారు.. విజయ దేవ్లోని ప్రతిభను గుర్తించిన గురువు స్పెషల్ క్లాస్ లతో అతని ప్రతిభను మెరుగు పరుస్తాడు. ఈ క్రమంలో పెద్దవాడైన విజయ్ దేవ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎం.ఎల్.ఎ డిప్యూటి స్పీకర్ స్థాయికెదుగుతాడు. అయినా తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేక పోతాడు. తెలంగాణా ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్ర సాధనే పరిష్కారం అని భావించి, తన పదవికి రాజీనామా చేసి, జయ్ (జయశంకర్) సార్ సూచనలు, సలహాలు తీసుకుని, తన అల్లుడుతో కలసి బంగారు తెలంగాణ పార్టీని స్థాపిస్తాడు.. కులమతాలకతీతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పార్టీకి మహ్మూద్ అలీ మద్ధతిస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరినామాలేడురైనాయి.. ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాల్సోచ్చింది? ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడానికి కారణాలేంటి? ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల ఆకాంక్షలు నేరవేర్చాడా? ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నాడా? తదితర విషయాలన్నీ తెరమీదే చూడాలి.

 

 

కథనం:

తెలంగాణ రావడానికి జరిగిన కృషి ని, ఈ ప్రయణం లో ఎంతో మంది చేసి త్యాగాలని ఎంతో చక్కగ చూపించారు. ముఖ్యంగా తెలంగాణ రాని సమయం లో అలనాటి భూస్వాములు రైతులు మీద చేసిన దాడులని కళ్ళకి కట్టినట్టు గా చూపించారు. సినిమా ఓపెనింగే ఓ అధ్బుతమైన ఉద్యమ పాట తో మొదలవ్వడం అనేది సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. తెలంగాణ గురించే కాదు ఆంధ్ర లో ఉండే పూతరేకుల గురించి ప్రస్థావించి అక్కడి గొప్పతనాన్ని చెప్పడం అనే సీన్ తెలంగాణ ప్రజలకి అంధ్రవారి మీద ఉన్న ప్రేమ మరియు గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమా పెద్ద ఎసెట్ ఆర్టిస్ట్స్ శ్రీకాంత్, బ్రహ్మానందం, అలి , సునీల్, సుమన్ లాంటి దాదాపు 50 మంది ప్రముఖ నటులతో చేయడం అనేది మూవీ విజయం లో కీలక పాత్ర ని పోషించింది. 

 

నటీనటులు :
ఉద్యమ వీరుడు విజయ్ దేవ్ పాత్రలో శ్రీకాంత్ ఒదిగిపోయి నటించాడు. తన స్వస్థలం ఆంధ్ర ప్రాంతమైనా కూడా తెలంగాణా ఉద్యమ వీరుడి పాత్రలో జీవించి, ఈ చిత్రంలోనీ అత్యధిక సంభాషణలు అలవోకగా పలికి ఆ పాత్రకు న్యాయం చేశాడు. విజయ్ దేవ్ బాల్య దశ పాత్రలో జిషాన్ కు గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా తన పరిధిమేరకు నటించి ఆ పాత్రను రక్తి కట్టించాడు.  యాక్టింగే కాదు ఫైట్స్ లో కూడ తన ప్రతిభని కనబరిచాడు జీషాన్ .    విజయ్ దేవ్ కి గురువుగా నటించిన బ్రహ్మనందం కామిడీ కే పరిమితం కాకుండా ఈ చిత్రంలో ప్రాముఖ్యమున్న పాత్రలో జీవించాడు. విజయ్ దేవ్ కి వైఫ్ క్యారెక్టర్ కి సంగీత జీవం పోసింది. ఇంకా జయ్ సర్ పాత్రలో సుమన్ మెప్పించగా, మహ్మూద్ అలీ పాత్రలో షియాజీ షిండే రక్తి కట్టించాడు. ఇంకా తనికెళ్ళ భరణి, సునీల్, అజయ్, వెంకట్,పృథ్విరాజ్, రఘుబాబు, బ్రహ్మాజీ హేమ, సన, రజిత ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ సీనియర్ ఆర్టిస్టలతో పెద్ద కమర్షియల్ సినిమాకు తీసిపోని విధంగా, ఈ సినిమా వెండితెరను పరిపుష్టం చేసిందనే చెప్పాలి.

 

 

సాంకేతిక నిపుణులు :
అందరూ అగ్రతారలను తొలి చిత్రంతోనే హాండిల్ చేసిన, ఘనత దర్శకుడు హరీష్ వాడత్యకే దక్కింది. కథ కథనాన్ని నడిపించడంలో, పాత్రా స్వభావాలను తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కాని, ఇంకా కొన్ని సంభాషణలు తగ్గించి, సన్నివేశాలు పెంచి ఉంటే మరింత ఆకట్టుకునేది. ఈ చిత్ర నిర్మాత (మహమూద్ జాకీర్ ఉస్మాన్) ఖర్చుకి వెనకాడకుండా దర్శకుడు అడిగింది లేదనకుండా ఇచ్చాడని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చు తెలుగు చిత్రసీమకు సినిమాల పట్ల అభిరుచి ఉన్న మరో మంచి నిర్మాత దొరికాడని. నందన్ బొబ్బిలి సంగీతం ఉద్యమ పాటలకు ఊపునిస్తుంది. సెంటిమెంటును రగిలిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకనుగుణంగా ఉంది.  సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి… పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే ఆర్టిస్ట్ లు ఎక్కువే లోకేషన్ లూ ఎక్కువే ఉంటాయి.. చాలా నేర్పుగా తన  కెమెరాతో సన్నివేశాలను చిత్రీకరించాడు అడుసుమిల్లి విజయ్ కుమార్.  ఇంకా ఎడిటర్ గౌతంరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కూర్పు బాగుంది.

 

చివరిగా :  తెలంగాణ దేవుడు కష్టాల్ని చూపించిన చిత్రం 

రేటింగ్ : 3/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!