చిత్రం : ప్రసన్నవదనం
విడుదల తేదీ : మే 3, 2024
నటీనటులు : సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్,నితిన్ ప్రసన్న, నందు, హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత
రచన, దర్శకత్వం : అర్జున్ వై.కె
సంగీతం : విజయ్ బుల్గానిన్
నిర్మాతలు :మణికంఠ,ప్రసాద్ రెడ్డి
విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించడానికి ఎప్పుడూ ప్రయత్నించే హీరో సుహాస్.. ఇప్పుడు ప్రసన్నవదనం అనే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చాడు. ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా సుహాస్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుంది? సినిమా ఆడియన్స్ కు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది అనే విషయాలు రివ్యూలో చూద్దాం..
కథ
సుహాస్ (సూర్య) తన తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు మరణిస్తారు, సూర్యకు ఫేస్ బ్లైండ్‌నెస్ అనే అరుదైన వ్యాధి వస్తుంది. దీని వల్ల ఒక వ్యక్తి ముఖం సూర్యకు పదే పదే వేరే విధంగా కనిపిస్తుంది. రేడియో మిర్చిలో జాకీగా పనిచేసే సూర్య, మంచి మనసున్న ఆధ్య (పాయల్ రాధాకృష్ణ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
అయితే, అమృత (సాయి శ్వేత) అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ప్రపంచం మొత్తం దాన్ని ప్రమాదంగా భావిస్తుంది, కానీ సూర్య అది హత్యేనని నమ్ముతాడు. అమృత కేసును ఛేదించడానికి, తన ఫేస్ బ్లైండ్‌నెస్‌ను అధిగమించడానికి సూర్య ప్రయత్నించాడు. అసలు నేరస్థులు ఎవరు? అమృత ఎవరు? సూర్య ప్రేమ ఏమైంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా మొత్తం మీద ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తి తన లోపాన్ని ఎలా ఎదుర్కొంటాడో ఈ సినిమాతో బాగా చూపించారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ లు బాగున్నాయి. హీరో, హీరోయిన్ మధ్య కామెడీ ట్రాక్ బాగుంటే సినిమా మరింత బాగుండేది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు సినిమాకి హైలైట్. రాశి సింగ్, సూర్య, పాయల్ రాధాకృష్ణ, నితిన్ ప్రసన్న నటన చాలా బాగుంది. బడ్జెట్ ఎక్కువగా ఉంటే సినిమా మరింత బాగుండేది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
సుహాస్ మరోసారి తన నటనతో మెప్పించాడు. ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తి పాత్రలో చాలా బాగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా మెరిశాడు. పాయల్ రాధాకృష్ణ తన పాత్రకు న్యాయం చేసింది. రాశి సింగ్ ఏసిపి పాత్రలో అద్భుతంగా నటించింది. నితిన్ ప్రసన్న, వైవా హర్ష, నందు, సత్య లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం సోసో గా ఉన్నాయి.
మొత్తానికి తెలుగులో ఫక్తు క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకన్న వారికి ప్రసన్న వదనం సినిమా బెటర్ ఆప్షన్.

బోటమ్ లైన్ : థ్రిల్లింగ్ వదనం

రేటింగ్ : 3/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!