విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో టాక్సీవాలా అనే హారర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆన్‌లైన్‌లో లీక్ అయి నప్పటికీ, థియేటర్లలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది ఈ మూవీ . వీరిద్దరూ త్వరలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. నానీ హీరోగా శ్యామ్ సింగ రాయ్‌ తెరకెక్కించిన రాహుల్ గత రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ ను ఫైనల్ డ్రాఫ్ట్‌తో ఒప్పించాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. నవంబర్‌లో షూటింగ్ ఫార్మాలిటీస్ ప్రారంభం కానున్నాయి. రాహుల్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ వంటి డిజాస్టర్‌ని ఫేస్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక యాక్షన్‌ మూవీలో నటిస్తున్నాడు. విజయ్ పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Leave a comment

error: Content is protected !!