Throwback pic : 1990లో విడుదలైన “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయి. ఈ చిత్రంలో బాలనటి షాలిని, ఆమె చెల్లెలు షామిలీ నటన ప్రేక్షకుల్ని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 34 ఏళ్ల తర్వాత, షాలిని మళ్లీ చిరంజీవిని కలిసి, ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

షాలిని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పాత ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో చిరంజీవి, షాలిని, ఆమె సోదరి షామిలీ, నటుడు రిచర్డ్ రిషి ఉన్నారు. ఈ నలుగురూ కలిసి “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రంలో నటించారు. “34 సంవత్సరాల తర్వాత మెగాస్టార్‌తో కలిసి ఒక అద్భుతమైన మధ్యాహ్నం,” అని షాలిని తన పోస్ట్‌లో రాసుకుంది. “ఈ ఫోటో నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ చిత్రం నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. చిరంజీవి గారు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తి.” ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి అండ్ షాలిని అభిమానులు ఈ ఫోటోను చాలా ఇష్టపడుతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి, త్రిష, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న “విశ్వంభర” చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. మల్లిడి వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  జనవరి 10న భారీ ఎత్తున  విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!