తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క,  శరత్ కుమార్, గౌతం వాసుదేవ మీనన్ నటించిన చిత్రం హిట్ లిస్ట్. కె. కార్తికేయన్ దీనికి డైరెక్టర్. ఈ చిత్రాన్ని కె.యస్. రవికుమార్ నిర్మించారు. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా టీజర్ ను వెర్సటైల్ హీరో సూర్య లాంచ్ చేశారు.

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లరైన ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. నేటి ప్రేక్షకులు ప్రధానంగా క్రైమ్ మరియు సస్పెన్స్ జానర్‌లలోని చిత్రాలకు ఆకర్షితులవుతున్నారు . అందుకే హిట్ లిస్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌ని వీక్షించిన హీరో సూర్య మాట్లాడుతూ.. ‘టీజర్‌ చాలా బాగుందని, సినిమా మరింతగా బాగుంటుందని ఆశిస్తున్నా. తప్పకుండా ఈ సినిమా విజయ్ కనిష్కకి, ఈ టీమ్‌కి మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Leave a comment

error: Content is protected !!