మీనాల్లాంటి కళ్ళు . సంపెంగ మొగ్గ లాంటి ముక్కు.. అద్దం లాంటి చెక్కిళ్ళు.. ముత్యాలు పేర్చిన తీరులో పలువరుస .. ముద్దొచ్చే మోము.. చంద్రబింబం లాంటి ముఖం. చిలిపి తనపు కొంటె కోణంగి .. తుంటరి చూపుల  వలపుల సంపంగి. బాలీవుడ్ వెండితెరపై వెన్నెలలా విరచూసిన ఆ సొట్టబుగ్గల చిన్నదాని పేరు సోనాక్షి సిన్హా. బాలీవుడ్‌ వెటరన్ హీరో  శత్రుఘ్న సిన్హా, ప్రముఖ నటి పూనమ్‌ సిన్హాల ముద్దుల కుమార్తె ఆమె.  తొలి సినిమా ‘దబాంగ్’ తో  భారీ విజయాన్ని అందుకుని ప్రేక్షకుల మదిలో నిలిచిందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో తొలి చిత్రానికే మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న నటి గా కూడా  ప్రత్యేకతను  సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించేందుకు ఆమె ఏకంగా 30 కిలోల బరువు తగ్గింది.తొలుత ఫ్యాషన్‌ డిజైనర్‌గా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది సోనాక్షి . ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ నటించిన ‘మేరే దిల్‌ లేకే దేఖో’ చిత్రానికి కాస్టూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. తర్వాత ‘ఆజ్‌ మూద్‌ ఇష్క్ హాలిక్‌ హాయ్‌’ అంటూ తన స్వరాన్ని బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత తెలుగులో రవితేజ, అనుష్కలు నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో ‘రౌడీ రాథోర్‌’ చిత్రంతో అక్షయ్‌ కుమార్‌ సరసన నటించి మెప్పించింది. ‘ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో ఆడియన్స్ హార్ట్స్ ని కొల్లగొడుతున్న  సోనాక్షి సిన్హా పుట్టినరోజు నేడు .  ఈ సందర్భంగా ఆ వెన్నెల సోనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

 

Leave a comment

error: Content is protected !!