Amaran : తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అమరన్‌’. ఈ సినిమాని రాజ్‌కుమార్‌ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి హీరో కమల్‌హాసన్‌ నిర్మిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను అక్టోబర్‌ 31న పలకరించనుంది.

ఈ సినిమా తెలుగు థియేట్రికల్‌ హక్కులను హీరో నితిన్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌ దక్కించుకున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘ఇండియాస్‌ మోస్ట్‌’ అనే పుస్తకంలోని ‘మేజర్‌ వరదరాజన్‌’ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివకార్తికేయన్‌ ఈ సినిమాలో ఓ ధైర్యవంతుడైన ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తుండగా, సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!