కరోనా మహమ్మారి పుణ్యమా అని సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.  సీరియళ్లు ఎంటర్ టైన్ మెంట్ షోలు వెబ్ సిరీస్ పై  కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ బాగా పడింది.  మొత్తానికి  ఈ లాక్ డౌన్ పేరు చెప్పి  టాలీవుడ్ కు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిపై ఆధారపడ్డ ఎంతో మంది కుటుంబాలకు ఉపాధి కరువవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ లపై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే లాక్ డౌన్ తో మూలనపడ్డ సినిమాలు ఇప్పట్లో షూటింగ్ లు మొదలుపెట్టకపోతే వాటి నిర్మాణం కష్టమే. నిర్మాతలు రోడ్డునపడుతారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సినిమాల షూటింగ్ లకు కొన్ని పరిమితులతో అనుమతి ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

జూన్ ఫస్ట్ నుంచి కొన్ని పరిమితులతో షూటింగ్ లకు అనుమతి ఇచ్చే  విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ లు, గ్లవ్స్, థెర్మల్ గన్ లు, శానిటైజర్ ఛాంబర్లు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం వుంది.  అయితే నెలాఖరుకు కేసుల తీవ్రతలో ఏమైనా తేడా వస్తే, మాత్రం నిర్ణయాలు మారవచ్చు.  అలాగే స్టూడియోలకు కూడా పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి నిబంధనలు విధిస్తారని తెలుస్తోంది.  అయితే థియేటర్ల అనుమతి మాత్రం ఇప్పుడే వుండకపోవచ్చు అని తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!