టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ ఏడాది సంక్రాంతికి నాగార్జున తో కలిసి నా సామిరంగ చిత్రంలో స్ర్కీన్ షేర్ చేసుకున్నాడు. సినిమా పర్వాలేద నిపించుకుంది. లేటెస్ట్ గా “భలే ఉన్నాడే” అనే వెరైటీ మూవీలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ ను వదిలారు మేకర్స్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

టీజర్ లో రాజ్ తరుణ్ శారీ డ్రాపింగ్ ను వృత్తిగా ఎంచుకున్న రాధ పాత్రలో కనిపిస్తాడు. అమ్మాయిలకు దూరంగా ఉండాలని అనుకునే ఈ క్యారెక్టర్ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తుంది. హీరోయిన్ మనీషా కందుకూరు అతడిని ప్రేమిస్తూ ఉంటుంది. టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. డైరెక్టర్ శివ సాయి వర్ధన్ ఒక వినూత్నమైన అంశాన్ని తీసుకుని రాజ్ తరుణ్ ను హిలేరియస్ క్యారెక్టర్ లో చూపించాడు. రాజ్ తరుణ్ కామిక్ టైమింగ్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది.

హీరోయిన్ మనీషా కందుకూరు తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అనేక మంది కమెడియన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగుంది. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘చెప్పవే చిరుగాలి’ ఫేమ్ అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ వంటి పలువురు నటీమణులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హైపర్ ఆది, గోపరాజు రమణ, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!