నా పేరు కార్తికేయ.. రీసెంట్ స్టార్ శివకార్తికేయన్‌ లా అవ్వాలనుకుంటున్నా.. ”మహేశ్వర్ రెడ్డి గారు ‘అయలాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఇన్వైట్ చేసినప్పుడు శివకార్తికేయన్ గారిని కలవచ్చని వచ్చేశా. అన్నారు యంగ్‌ హీరో కార్తికేయ. అయలాన్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌ లో సందడి చేసిన కార్తికేయ శివకార్తికేయన్‌ వర్క్ డెడికేషన్‌, స్టార్‌డమ్‌ గురించి చెప్తూ.. తాను కూడా శివకార్తికేయన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యానన్నారు. శివకార్తికేయన్‌, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఏలియన్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సైన్స్‌ఫిక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అయలాన్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో శివకార్తికేయన్, కార్తికేయ లు మెయిన్‌ ఎట్రాక్షన్‌. దర్శకులు గోపీచంద్ మలినేని, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. వాళ్ల చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరించారు.
చిన్నప్పుడు ‘కోయీ మిల్‌ గయా’ చూసి హృతిక్‌ రోషన్‌ ఫ్యాన్‌ అయ్యా.. ఇప్పుడు అయలాన్ చూసి చిన్నపిల్లలందరూ శివకార్తికేయన్‌ ఫ్యాన్స్ అవుతారన్నారు కార్తికేయ. రీసెంట్ టైమ్‌లో స్టార్‌ ఎదిగిన శివకార్తికేయన్.. తన స్నేహితులను కూడా పైకి తీసుకొచ్చారంటూ పొగిడారు. తమిళ్‌లో వరుస విజయాలు సాధిస్తూ.. తెలుగులోనూ డబ్‌ వెర్షన్స్‌తో హిట్స్ కొడుతున్నారు శివకార్తికేయన్.. ఆయన రీసెంట్ మూవీ ‘మహావీరుడు’ నా మోస్ట్ ఫేవరెట్ అన్నారు. అయలాన్‌ కూడా తెలుగులో పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.


నేను, ఏలియన్ కలిసి ఈసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాం. ఈ సినిమాను పిల్లలు, ఫ్యామిలీ… అందరూ కలిసి చూడొచ్చు. అందరికీ నచ్చుతుంది. ఇండియన్ సినిమాలో ఇది ఒక కొత్త ప్రయత్నం. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరించారు. సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ పెద్ద హిట్ అయ్యింది. ఆ టీంకు కంగ్రాట్స్. ఆ సినిమా ఎలాగైతే అందర్నీ ఎంటర్టైన్ చేసిందో, ఈ ‘అయలాన్’ కూడా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. అందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడండి అన్నారు హీరో శివకార్తికేయన్.
టీజర్ చూసి షాక్ అయ్యా. లాస్టులో ఏలియన్‌ను కొట్టి టీ పెట్టమని చెప్పే సీన్ చూసి నవ్వుకున్నాను. ‘వాలిబర్ సంఘం’ నుంచి శివ కార్తికేయన్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన ప్రతి సినిమా చూశా. ఆయన కామెడీ టైమింగ్ ఎక్స్ట్రార్డినరీ. ఆయన ఆల్ రౌండర్ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని.
నేను రజనీకాంత్ గారికి పెద్ద ఫ్యాన్. శివ కార్తికేయన్ యంగ్ రజనీలా ఉంటారు. కంగ్రాట్స్ టు ఫాంటమ్ కంపెనీ. ఇది మామూలు కష్టం కాదు. ప్రతి ఫ్రేమ్ చేయాలి. మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు రవికుమార్ కి కంగ్రాట్స్ అన్నారు దర్శకుడు వశిష్ట,
”సినిమాను ప్రేమిస్తూ… చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నిటినీ థియేటర్లకు వెళ్లి చూస్తూ… అవి ఘన విజయాలు సాధించేలా చేసే తెలుగు ప్రేక్షకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సినిమాకు అతి పెద్ద శక్తి ఉంది. అది భాషా భేదం లేకుండా మనల్ని కలుపుతుంది. ప్రేమించేలా చేస్తుంది. నేను కూడా తెలుగు సినిమాలు ఇష్టపడి చూస్తాను. ఈ రోజు అన్ని సినిమాలను డబ్బింగ్ చేసి విడుదల చేయడం వల్ల భాషా భేదం లేకుండా ఆనందించగలుగుతున్నాం. కొత్త ప్రయత్నాలను, ఫాంటసీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో మేం కూడా ఏలియన్ జానర్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాగా ‘అయలాన్’ను తీశాం. మీరు ఆదరిస్తున్నారని నమ్ముతున్నాను” అని అన్నారు ‘అయలాన్’ చిత్ర దర్శకుడు ఆర్. రవికుమార్.

Leave a comment

error: Content is protected !!