ప్రతి బిడ్డకు ఏమి ఇవ్వాలో ప్రతీ తండ్రీ ఆలోచించే సమాజం మనది. అలాంటి సమాజంలో తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని నమ్మే కొడుకు ఎమోషనల్ డ్రామా సత్య. ఇందులో హమారేష్ , ప్రార్థన సందీప్ నటించారు. వాలీ మోహన్ దాస్ దీనికి దర్శకుడు. శివమ్ మీడియా పతాకంపై శివమల్ల నిర్మించిన ఈ చిత్రం మే 10 న విడుదల కానుంది. ఇప్పటికే థింక్ మ్యూజిక్‌లో ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయగా దీనికి మంచి స్పందన లభించింది. ఇంక సత్య చిత్రానికి సెన్సార్ బోర్డ్ కూడా యు సర్టిఫికేట్ ఇచ్చింది. హమారేష్, ప్రధాన సందీప్, ఆడుగలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ, ఈ చిత్రానికి సంగీతం – సుందరమూర్తి కె.ఎస్.

Leave a comment

error: Content is protected !!