Sarvanand : యూత్ స్టార్ శర్వానంద్ లేటెస్ట్ మూవీ మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈ సందర్భంగా హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ పండుగ వాతావరణాన్ని మరింత పెంచడానికి మా “మనమే” సినిమా వస్తోంది.చాలామంది నన్ను కనిపించినప్పుడల్లా “మహానుభావుడు”, “ఎక్స్‌ప్రెస్‌ రాజా”, “రన్‌ రాజా రన్‌” లాంటి సినిమాలు చేయమని అడుగుతూ ఉంటారు. కానీ నాకు కొత్తగా ప్రయత్నించాలనే ఉంటుంది. అలాంటి సమయంలో శ్రీరామ్ ఆదిత్య చెప్పిన ఈ కథ నాకు నచ్చింది.

“మనమే” కొత్త తరహా క్యారెక్టరైజేషన్ తో కూడిన కథ. మనిషికీ మనిషికీ ఇవ్వగలిగే గొప్ప బహుమానం సమయం. ఆ అంశం చుట్టూ శ్రీరామ్ ఆదిత్య అల్లిన ఈ కథ చాలా బాగుంది. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న చంద్రబాబు నాయుడు, హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కు అభినందనలు ’ అన్ని అన్నారు శర్వానంద్.

Leave a comment

error: Content is protected !!