Saripoda sanivaram teaser : నేచురల్ స్టార్ నానీ లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”. ఈ సినిమా నుంచి ఈ రోజు టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, ఎస్‌.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించాడు. నేడు యస్.జే. సూర్య పుట్టినరోజు కావడంతో ఈ టీజర్‌ను చిత్రబృందం ప్రత్యేకంగా విడుదల చేసింది.

80 సెకన్ల పాటు సాగే ఈ టీజర్ తో చిత్ర కథాంశాన్ని, పాత్రలను క్లుప్తంగా పరిచయం చేశారు. శ్రీకృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసుర వధ చేసిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్ర కథను రూపొందించారు. నాని, ప్రియాంకా మోహన్, ఎస్‌.జె.సూర్య పాత్రలను ఈ టీజర్‌లో చూపించారు. సూర్య ఒక క్రూరమైన పోలీస్ పాత్రలో నటిస్తుండగా, అతని అరాచకాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చిత్ర కథాంశం. సూర్య-నాని మధ్య జరిగే పోరాటం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది.

“శనివారం” అనే కాన్సెప్ట్ కూడా ఈ చిత్రంలో కొత్తగా ఉండబోతోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాల ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి రెట్టింపు అయింది. యాక్షన్‌కు ఈ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు టీజర్‌ ద్వారా తెలుస్తోంది. రామ్‌మిఖీల్ సంగీతం చిత్రానికి మరింత ఊపునిచ్చింది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆగస్టు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!