Samyuktha Menon : హీరోయిన్ సంయుక్త మీనన్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ‘మహారాజ్ఞి’ అనే సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘స్పై’ ఫేమ్ చరణ్ తేజ్ ఉప్పాలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, కాజోల్ జంటగా నటిస్తు్న్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 1997 లో విడుదలైన ‘మెరుపుకలలు’ చిత్రంలో ఇద్దరూ జోడీగా నటించారు. చాన్నాళ్ళ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న  ఈ సినిమా యాక్షన్, ఇంటెన్స్ డ్రామాతో రూపొందుతోంది.

విమానం నుండి స్టైలిష్ గా దిగుతున్న ప్రభుదేవా, గ్లామరస్ డ్రెస్ లో కారు రేసింగ్ లో సంయుక్త మీనన్ కొరడాతో విలన్లను తరిమే కాజోల్ విడుదలైన గ్లింప్స్ లోని హైలైట్స్. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. సంయుక్త మీనన్ గతేడాది ‘సార్’, ‘విరూపాక్ష’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభు’, మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘మహారాజ్ఞి’ చిత్రం సంయుక్త కెరీర్ లో మైలురాయిగా నిలవడానికి అవకాశాలు ఉన్నాయి.

Leave a comment

error: Content is protected !!