Remake of the Day : మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఓ ప్రత్యేకమైన సినిమా స్నేహంకోసం. తండ్రీ కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి కె.యస్.రవికుమార్ దర్శకుడు. చిరంజీవి స్నేహితుడిగా విజయ్ కుమార్ మరో ప్రత్యేకపాత్రలో నటించి మెప్పించారు. శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై ఏయం రత్నం ఈ సినిమాను నిర్మించాడు.

మీనా హీరోయిన్ గా నటించగా, సితార, సుజాత, నిర్మలమ్మ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. స్నేహమంటే ప్రాణం పెట్టే పాత్రల్లో చిరంజీవి, విజయ్ కుమార్ జీవించారు. 1999, జనవరి 1న విడుదలైన ఈ సినిమా పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది.

నిజానికి ‘స్నేహంకోసం’ చిత్రం శరత్ కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘నట్పుక్కాగ’ కు ఆఫీషియల్ రీమేక్. శరత్ కుమార్ అండ్ విజయ్ కుమార్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాని కె.యస్.రవికుమార్ తెరకెక్కించారు. ఇదే సినిమాను కన్నడలో విష్ణువర్ధన్, అంబరీష్ తో ‘దిగ్గజరు’ గా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Leave a comment

error: Content is protected !!