పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు..మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పు కూడు మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి. రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. 
         తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది.
చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు సి.పుల్లయ్య. 1935లోనే సినిమాల్లోకి ప్రవేశించినా 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేశాడు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించారు.
          నటుడిగా తారా స్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975 లో వచ్చిన పూజ. చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించారు.
రేలంగి వెంకట్రామయ్య గారు జీవితం గురించి వ్యాఖ్యానిస్తూ ….
రాళ్ళు తిని అరాయించుకునే వయస్సులో మరమరాలుకూడా దొరకలేదు రత్నాలు కొనగలిగిన స్తోమత ఉన్నపుడు మరమరాలుకూడా అరగడం లేదు అని అనేవారు.

Leave a comment

error: Content is protected !!