Shopping Cart 0 items - $0.00 0

‘ఉప్పెన’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

 

మెగా మేనల్లుడు సాయిధర్మతేజ సోదరుడు వైష్ణవ్ తేజ హీరోగా .. మైత్రీ మూవీస్ నిర్మాణంలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న .. విలేజ్ లవ్ స్టోరీ ‘ఉప్పెన’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మైత్రీమూవీస్ వారు తమ ట్విట్టర్ లో కొద్ది నిమిషాల క్రితమే  అఫీషియల్ గా రిలీజ్ చేశారు. దాంతో పాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా పోస్టర్ లో మెన్సన్ చేశారు. సినిమాను ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

హీరో వైష్ణవ్ తేజ సముద్రం వైపుకు తిరిగి.. రెండు చేతుల్నీ చాపి ఎంజాయ్ చేస్తున్న పోజ్  ను ఫస్ట్ లుక్ గా వదిలారు. ఈ స్టిల్ మెగాభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది.   కొత్తమ్మాయి కృతి షెట్టి కథానాయికగా నటిస్తోన్న   ఈ మూవీలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ‘ఉప్పెన’ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను ముంచెత్తుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!