Atlee : ‘జవాన్’ విజయం తర్వాత, దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం గురించి స్పష్టత ఇస్తున్నాడు. సల్మాన్ ఖాన్‌తో పాటు మరో దక్షిణాది నటుడితో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ  మరో హీరో ఎవరో కాదు.  సూపర్ స్టార్ రజనీకాంత్ అని తెలుస్తోంది.

అట్లీ ప్రస్తుతం రజనీకాంత్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఖచ్చితంగా ఖరారైతే, ఇది భారతీయ చిత్రసీమలోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రం పట్టాలెక్కించే అవకాశం ఉంది.

సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ‘కూలీ’ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కొత్త మల్టీస్టారర్ సినిమా గురించి మరింత అధికారిక సమాచారం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!