శ్రీ హర్షిత మూవీస్, కళా మూవీ మేకర్స్ నిర్మాతలు పులిచర్ల నాగరాజు, రామచంద్ర, కొల్లకుంట నాగరాజు. వారి నిర్మాణ సారథ్యంలో బాల పొలుబోయిన దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (PTKK). పురాణాలకు టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుందో సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కన్నడ హీరో సిద్ధార్థ్ మహేష్ క్లాప్ కొట్టగా, ప్రొడక్షన్ హెడ్ రాజ్యలక్ష్మీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూనిట్‌కు స్ర్కిప్ట్ అందించారు.

‘‘టీమ్ అంతా కొత్తవాళ్లే అయ్యిన టాలెంట్‌కు బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదని కంటెంట్ ఉంటే కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సినిమా విషయానికి వస్తే మన పురాణాలు, ఇతిహాసాలన్నింటిని, సైన్స్ అండ్ టెక్నాలజీతో బ్యాలెన్స్ చేసి తయారు చేసిన స్క్రిఫ్ట్‌తో ఓ ఫ్యూజన్ జోనర్‌ని పరిచయం చేయబోతున్నారట. ఇండియన్ సినిమాకు ఈ సినిమాతో సరికొత్త స్ర్కీన్‌ప్లే విధానాన్ని పరిచయం చేయబోతున్నారు.

Leave a comment

error: Content is protected !!