Shopping Cart 0 items - $0.00 0

‘జాను’ రిలీజ్ డేట్ ఖరారు

 

 

యంగ్ హీరో శర్వానంద్, అందాల సమంతా జంటగా నటిస్తోన్న పిరీయాడికల్ లవ్ స్టోరీ ‘జాను’. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన  ‘96’ తమిళ సూపర్ హిట్టు మూవీకిది రీమేక్ వెర్షన్. ఒక స్కూల్లో  చదువుకున్న 10th క్లాస్ బ్యాచ్ .. 22 ఏళ్ళ తర్వాత గెట్ టుగెదర్ చేసుకొని తమ జ్నాపకాల్నిపంచుకోవడం ఈ మూవీ కథ. ఆ నేపథ్యంలో సాగే ప్రేమకథ తమిళ తంబీల గుండెల్ని పిండేసింది. అదే ఫీల్ ను తెలుగు వెర్షన్ లోనూ తీసుకుని రావడానికి నిర్మాత దిల్ రాజు .. అదే దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ నే ‘జాను’కు ఎంపికచేశాడు.

‘జాను’ మూవీని ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా వెలైంటైన్స్ కానుకగా..  ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ ‘వరల్డ్ పేమస్ లవర్’ విడుదల కానుంది. అందుకే ‘జాను’ విడుదలను  ఒక వారం ప్రీపోన్డ్ చేశారు. తమిళ వెర్షన్ కు సంగీతాన్ని అందించిన గోవింద్ వసంత్ నే ‘జాను’ మూవీకి మ్యూజిక్ సమకూర్చుతున్నాడు. మరి విజయ్ సేతుపతి , త్రిష ల పోషించిన అవే పాత్రల్ని శర్వానంద్, సమంతా ఏ రేంజ్ లో రక్తికట్టిస్తారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!